Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:13 PM

కౌంటింగ్‌లో చిన్న పొరపాటు కూడా సహించం. కలెక్టర్ హనుమంతరావు

12-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పారదర్శకతే ప్రాధాన్యం – అధికారులకు కలెక్టర్ హనుమంతరావు గట్టి హెచ్చరిక

భువనగిరి:

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అలక్ష్యం, అవ్యవస్థకు తావులేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో వ్యవహరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను కఠినంగా ఆదేశించారు. కౌంటింగ్ అనేది ఎన్నికలలో అత్యంత కీలక దశ అని స్పష్టం చేశారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అక్షరశః పాటించాలని, రూల్ 56 ప్రకారం మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంటుందని తెలిపారు. యాక్ట్ 212 ప్రకారం సీక్రెసీ మెయింటెనెన్స్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

ప్రతి బ్యాలెట్ పేపర్‌ను కౌంటింగ్ ఏజెంట్లకు స్పష్టంగా చూపించి, సంబంధిత పీజియన్ హోల్ సీల్ ట్రేలో వేయాలని ఆదేశించారు. ఎటువంటి సందేహాలకు తావులేకుండా విధులు నిర్వహించాలని, ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. “కౌంటింగ్‌లో చిన్న తప్పిదం కూడా పెద్ద వివాదాలకు దారి తీస్తుంది” అని హెచ్చరించారు.

అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను నియమిస్తామని తెలిపారు. క్రమబద్ధమైన విధానంతో కౌంటింగ్ పూర్తి చేసి, నివేదికలను సమయానుకూలంగా సమర్పించాలని సూచించారు.ఈ శిక్షణలో ఆర్డీవో కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, డీపీవో విష్ణువర్ధన్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కౌంటింగ్‌లో చిన్న పొరపాటు కూడా సహించం. కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News