Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:17 AM

కొత్త పెన్షన్ దరఖాస్తులకు తాజా ధ్రువపత్రాలు తప్పనిసరి

కొత్త పెన్షన్ దరఖాస్తులకు తాజా ధ్రువపత్రాలు తప్పనిసరి

కొత్త పెన్షన్ దరఖాస్తులకు తాజా ధ్రువపత్రాలు తప్పనిసరి
21-02-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కొత్తగా పెన్షన్ కొరకు దరఖాస్తు చేయుటకు కావాల్సిన డాకుమెంట్స్ :

కొత్త సంవత్సరం 2026లో ప్రభుత్వ పెన్షన్ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా తాజా ఆదాయం, కుల ధ్రువపత్రాలను సమర్పించాలని అధికార వర్గాలు సూచించాయి. గతంలో పొందిన ఆదాయం, కుల సర్టిఫికెట్లు ఉన్నవారు మీ సేవా కేంద్రానికి వెళ్లి పునరుద్ధరణ చేయించుకుని నవీకరించిన ప్రతులను తీసుకురావాలని స్పష్టం చేశారు.

అలాగే ఆధార్ నంబర్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం తప్పనిసరి అని తెలిపారు. అవసరమైన పత్రాల జిరాక్స్ ప్రతులతో సచివాలయంలో సమర్పించి కొత్త పెన్షన్లకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

సాధారణంగా అవసరమైన పత్రాలు:

ఆధార్ జిరాక్స్ ప్రతులు

ఆధార్ హిస్టరీ

రేషన్ కార్డు

ఆదాయం సర్టిఫికెట్ (తాజా)

కుల సర్టిఫికెట్ (తాజా)

వితంతు పెన్షన్‌కు అదనంగా:

భర్త మరణ ధ్రువపత్రం

ఒంటరి మహిళా పెన్షన్‌కు అదనంగా:

ప్రభుత్వ లేదా కోర్టు ద్వారా నిర్ధారించిన విడాకుల ధ్రువపత్రం

వృద్ధాప్య పెన్షన్‌కు అర్హత:

వయస్సు 60 సంవత్సరాలు పైబడినట్లు ధ్రువీకరణ

వికలాంగుల పెన్షన్‌కు అదనంగా:

ప్రభుత్వ వైద్యుల ద్వారా జారీ చేసిన సదరం ధ్రువపత్రం (వికలాంగత్వ నిర్ధారణ పత్రం)

అర్హులైన వారు అన్ని పత్రాలను సక్రమంగా సిద్ధం చేసుకుని సమీప గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

Sthanikam

కొత్త పెన్షన్ దరఖాస్తులకు తాజా ధ్రువపత్రాలు తప్పనిసరి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News