Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుల వివక్ష ఆరోపణలతో చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:45 PM

కొమ్మెరలో కుల దురహంకార దాడి: రెండు నెలల పాప హత్యపై వెల్లంకిలో సిపిఎం నిరసన

కొమ్మెరలో కుల దురహంకార దాడి: రెండు నెలల పాప హత్యపై వెల్లంకిలో సిపిఎం నిరసన

కొమ్మెరలో కుల దురహంకార దాడి: రెండు నెలల పాప హత్యపై వెల్లంకిలో సిపిఎం నిరసన
February 23, 2026 07:21 PM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో గుడిలోకి ప్రవేశిస్తున్న రజక సామాజిక వర్గానికి చెందిన కీర్తన కుటుంబం పై దాడి చేసి రెండు నెలల పాపను హత్య చేసిన గ్రామ పెత్తందారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు.


వెల్లంకి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక గ్రామపంచాయతీ కేంద్రంలో సిపిఎం కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులం పేరుతో రాష్ట్రంలో అనేక చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్న పాలకులు నిమ్మకు నీరతునటు వివరించడం సరికాదని మనువాదం పేరుతో మతం పేరుతో కిందివర్గాల వారిని అంటరాని వాళ్ళుగా చూడడం వారిపై దాడులు చేయడం గత కాలం నుండి వస్తుందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కుల దురహంకార హత్యలు జరగకుండా కఠిన చట్టాలను అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం చేతగానితనంతో ఇలాంటి హత్యలు జరుగుతున్నాయని ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందించాలని కులతత్వాన్ని దూరం చేయాలని రెండు నెలల పాపను హత్య చేసిన గ్రామ పెత్తందారులపై హత్య కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించి కీర్తన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని అన్నరు.


ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు మేక అశోక్ రెడ్డి,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం,జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్,బల్గూరి అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహ చారి, బోయిని ఆనంద్, జంపాల అండాలు, కందుల హనుమంతు, కల్లూరి నగేష్,గ్రామ శాఖ కార్యదర్శి ఆవనగంటి నగేష్, గన్నేబోయిన విజయ భాస్కర్, బావండ్లపల్లి బాలరాజు, బోడిగే రజిత, గొరిగే సోములు, వేముల సైదులు, తొలుపునూరి శ్రీనివాస్, ఎండీ రషీద్, వెల్లంకి గ్రామ నాయకులు కర్రె సంతోష్, ఆవనగంటి స్వామి,బర్ల బాబురావు,ఎర్రోళ్ళ నర్సింహా, తాటిపాముల సంతోష,తాటిపాముల మహేష్,కన్నెబోయిన రాజలింగం, తాటిపాముల వనిత, ఆవనగంటి వెంకటమ్మ, తాటిపాముల నవీన్, కరకంటి మల్లయ్య, పున్న దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News