Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:33 AM

కోడి పందేలపై ఉక్కుపాదం మోపండి ఉపకరణాలు, పందేల డబ్బును జప్తు చేయండి ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా మీదే బాధ్యత జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు

11-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కోడి పందేలపై ఉక్కుపాదం మోపండి ఉపకరణాలు, పందేల డబ్బును జప్తు చేయండి ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా మీదే బాధ్యత జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు హైకోర్టు ఆదేశం

అమరావతి, జనవరి 11 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కోడి పందేలు, జూద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని హైకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా కోడి పందేలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జంతుహింస నిరోధక చట్టం 1960, ఏపీ జూద నిరోధక చట్టం 1974ను కఠినంగా అమలు చేయాలని అన్నీ జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిష నర్లు, ఎస్పీలను ఆదేశించింది. ఈ చట్టాలను పక్కాగా అమలు చేయాల్సిందేనని, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే అందుకు వ్యక్తిగతంగా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. చట్టాల అమలులో విఫలమైన తహసీల్దార్లు, పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు స్పష్టం చేసింది. కోడి పందేల పేరుతో బెట్టింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్ల రూపాయలు, విలువ చేసే ఆస్తులను కోల్పోయే పరిస్థితి నెలకొందంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కోడి పందేలను నియంత్రించాలని కోరుతూ వినతి పత్రాలు ఇచ్చినా కూడా పోలీసులు పట్టించు కోవడం లేదని పిటిషన్లలో పేర్కొన్నారు. ఆయా పిటిషన్లపై విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఆయా జిల్లాల్లోని మండలాల్లో సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను న్యాయస్థానం ఆదేశించింది.

Sthanikam

కోడి పందేలపై ఉక్కుపాదం మోపండి ఉపకరణాలు, పందేల డబ్బును జప్తు చేయండి ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా మీదే బాధ్యత జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు

Article Image

కోడి పందేలపై ఉక్కుపాదం మోపండి ఉపకరణాలు, పందేల డబ్బును జప్తు చేయండి ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా మీదే బాధ్యత జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు హైకోర్టు ఆదేశం

అమరావతి, జనవరి 11 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కోడి పందేలు, జూద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని హైకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా కోడి పందేలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జంతుహింస నిరోధక చట్టం 1960, ఏపీ జూద నిరోధక చట్టం 1974ను కఠినంగా అమలు చేయాలని అన్నీ జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిష నర్లు, ఎస్పీలను ఆదేశించింది. ఈ చట్టాలను పక్కాగా అమలు చేయాల్సిందేనని, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే అందుకు వ్యక్తిగతంగా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. చట్టాల అమలులో విఫలమైన తహసీల్దార్లు, పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు స్పష్టం చేసింది. కోడి పందేల పేరుతో బెట్టింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్ల రూపాయలు, విలువ చేసే ఆస్తులను కోల్పోయే పరిస్థితి నెలకొందంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కోడి పందేలను నియంత్రించాలని కోరుతూ వినతి పత్రాలు ఇచ్చినా కూడా పోలీసులు పట్టించు కోవడం లేదని పిటిషన్లలో పేర్కొన్నారు. ఆయా పిటిషన్లపై విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఆయా జిల్లాల్లోని మండలాల్లో సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను న్యాయస్థానం ఆదేశించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News