Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:51 AM

ఖేఢ్ సబ్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మచ్చేందర్

10-01-2026 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:

నారాయణఖేడ్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమా హారతిని జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ భేటీలో నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో చేరుతున్నాయా లేదా అనే అంశాలపై సబ్ కలెక్టర్‌తో సమగ్రంగా చర్చించారు.ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలంటే అధికార యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం అత్యంత అవసరమని మచ్చేందర్ పేర్కొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి కావాలంటే సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ అనుముల మారుతి, ర్యాలమడుగు మాజీ ఎంపిటిసి అమ్ర్య నాయక్, నారాయణఖేడ్ మున్సిపల్ 4వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్, సందుపట్ల రాములు, హన్మండ్లతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఖేఢ్ సబ్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మచ్చేందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News