కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తు న్నాయి.ప్రతిపక్షం లేని రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే.సిపిఐ ఎంఎల్ లిబరే షన్ రాష్ట్ర కార్యదర్శి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తు న్నాయి.ప్రతిపక్షం లేని రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే.సిపిఐ ఎంఎల్ లిబరే షన్ రాష్ట్ర కార్యదర్శి
GADDAM JAGANMOHAN REDDY
కేంద్రం లోని మోడీ ప్రభుత్వం,రాష్ట్రంలోకూటమి ప్రభుత్వం దేశ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి బంగార్రా వు అన్నారు. ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ఏలూరుజిల్లా సమావేశం నిర్వహించింన అనంతరం రమణక్కపేట సెంటర్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జెండా ఆవిష్కరణ బి బంగార్రావు చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం లోని మోడీ ప్రభుత్వా నికి కూటమి ప్రభుత్వ నాయకులు, వైసిపిపూర్తి మద్దతు ఇస్తున్నాయని, రాష్ట్రంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి టిడిపి కూటమి ప్రభుత్వం, మరియు జగన్ వైసిపి నాయకులు రాష్ట్రంలో కొట్లాడుకుంటూ కేంద్రంలో మోడీ అమిత్ షా తో డిన్నర్ చేసుకుంటూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
భారత దేశాన్ని వ్యాపారం పేరుతో వచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, జిరామ్ జి పథకాన్ని పార్ల మెంట్లో ప్రవేశ పెట్టడాన్ని లిబరేషన్ పార్టీ వ్యతి రేకిస్తుందని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలు, అలానే ఎన్జీవో సంఘా లు, ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీ య ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఈ మోడీ ప్రభుత్వం ఎత్తివేయాల ని కుట్రతో తీసుకొచ్చిన (వి బి జి రాంజీ ) వికసిత్ భారత్ ఉపాధి హామీ మిషన్ గ్రామీణ ఉపాధి పథకం2025 ను పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్వ హిస్తామని తెలిపారు.
125 రోజులు పని సెక్షన్ 224, సెక్షన్ 5 (1)తో కలిపి చదివినప్పుడు ప్రభుత్వం 125 రోజుల పని అని చెప్తున్నా చట్టంలో అన్ని గ్రామాలకు అన్ని కుటుంబాలకు ఇది తప్పనిసరి అని ఎక్కడా స్పష్టం చేయ లేదనీ, తగిన నిధులు కేటాయించక పోతే అసలు పని దొరకని పరిస్థితిఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నేటి భారతదేశంలో సంపద మరియు ఆదయ అసమానతలు అత్యధికంగా పెరుగుతున్నాయని, మతం కులం మరియు డబ్బు నియంత్రణలో భారత ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమవుతున్నదని, ప్రస్తుత భారత రాజ్యము యొక్క అన్ని వ్యవస్థల పైన మరియు మెజారిటీ హిందువుల మనసుల పైన ఆర్ఎస్ఎస్ బిజెపిల కార్పోరేట్ మతతత్వ భావజాలం పట్టు సంపాదించిందనీ, లౌకికవాదం సామాజిక సామరస్యాలు లోటు ప్రమాదకరమైన స్థాయికి చేరిందని దీనివల్ల దాదాపు మూడు దశాబ్దాలు పైగా పరివార్ దాడులకు మైనారిటీ మతాలకు చెందిన ప్రజలు ముఖ్యంగా ముస్లింలు క్రైస్తవులు మరియు గిరిజన దళిత వర్గాల వారు పెద్దఎత్తున గురవుతున్నారని తెలిపారు.
కార్పొరేట్ మీడియా దీనికి వంద పడుతుందని, కానీ తలసరి ఆదాయం పరంగా మన దేశం చాలా బలహీనమైన స్థాయిలో ఉందని తెలిపారు. దేశమంతటా కుల మత ఆధారిత వివక్ష కొనసాగుతుందని న్యాయవ్యవస్థలో ఆందోళనకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నయన్నారు. భారత ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛను కో ల్పోతున్నారని, చట్ట బద్ధమైనసంస్థలస్వయం ప్రతిపత్తి కుదించి వేయబడిందని,సామాజిక కార్యకర్తలపై మత తత్వ రాజకీయ ఆర్థిక నేరస్తుల దాడులు పెరు గుతున్నాయని, ఇటు వంటి పరిస్థితుల్లో ప్రజ ల పక్షాన ప్రజల హక్కు లకై పోరాడు తున్న సిపిఐ ఎంఎల్ లిబ రేషన్ పార్టీ పోరాటాల కు ప్రజలు మద్దతు తెల పాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏలూ రు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి హరినాథ్, ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు వి బక్కయ్య, బి పూజి త, కే వెంకటేశ్వర రావు, సిహెచ్ బాబురావు, టీ తిరుపతిరావు, రేగుల రాముడు, అఖిల్, ఎన్ రాణి, ఎన్ భవాని,తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి