Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:12 PM

కాయకల్ప పీర్ అసెస్మెంట్ టీం దృష్టిలో రామన్నపేట ఏరియా ఆసుపత్రి… సేవలపై సంతృప్తి

13-02-2026 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శుక్రవారం కాయకల్ప పీర్ అసెస్మెంట్ టీం ఆకస్మికంగా పరిశీలించింది. శంకర్ నాయక్ నేతృత్వంలోని బృందం ఆసుపత్రిలోని వైద్య సేవలు, పారిశుధ్యం, నిర్వహణపై సమగ్ర సమీక్ష చేపట్టింది.

మొదటగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించిన బృందం, రోగులకు అందిస్తున్న సేవలపై వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రశ్నించి వివరాలు సేకరించింది. అనంతరం వార్డుల్లోకి వెళ్లి రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స, మందుల లభ్యత, సిబ్బంది స్పందనపై అభిప్రాయాలు తెలుసుకుంది.ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఔట్ పేషంట్ విభాగం, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతను ప్రత్యేకంగా పరిశీలించిన బృందం, మొత్తం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాయకల్ప ప్రమాణాల ప్రకారం పారిశుధ్య నిర్వహణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డా. శ్వేతా ప్రియాంక, సివిల్ సర్జన్ డా. పి. వీరన్న ఆధ్వర్యంలో బృంద సభ్యులను శాలువాలతో సన్మానించారు. వైద్యులు రాజగోపాల్, మాధవాచారి, శ్రీనివాస్, దేవేందర్, నవీన్ సింగ్, స్వాతి బాయి, వీణ, రజిని, వరుణ్ రెడ్డి, సుమంగళి, హెడ్ నర్సులు సువర్ణ, సోలి, జ్యోతి తదితర నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

కాయకల్ప పీర్ అసెస్మెంట్ టీం దృష్టిలో రామన్నపేట ఏరియా ఆసుపత్రి… సేవలపై సంతృప్తి

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News