Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
205 రోజులుగా ఎదురుచూపులే.. తనకు న్యాయం చేయాలని విలేకరి వేడుకోలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:59 PM

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌ ఐదుగురు మావోయిస్టులు మృతి..

20-02-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు హతమైనట్టు భద్రతా వర్గాలు భావిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు.

నిఘా వర్గాల సమాచారం మేరకు మావోయిస్టు కీలక నేత దేవ్‌జీ కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో సుమారు ఐదు వేల మంది భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించారు. మధ్యప్రదేశ్‌ వైపు నుంచి మావోయిస్టులు అడవుల్లోకి చొరబడ్డారనే సమాచారం నేపథ్యంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టగా కాల్పులు చెలరేగాయి. ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’ గడువు సమీపిస్తున్న వేళ భద్రతా చర్యలు వేగవంతం అయ్యాయి. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతి చెందగా, వేలాది మంది వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఎదుట లొంగిపోయినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు దేహార్‌ మిశ్రా, దేవ్‌జీ, గణపతి సజీవంగా ఉన్నట్టు సమాచారం ఉన్నప్పటికీ తాజా ఘటనపై స్పష్టత రాలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కూడా కీలక నేతల కదలికలపై దృష్టి సారించింది. తాజా పరిస్థితులపై కేంద్ర హోం శాఖకు నివేదికలు పంపుతున్నట్లు తెలుస్తోంది.

కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా, పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Sthanikam

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌ ఐదుగురు మావోయిస్టులు మృతి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News