Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:16 PM

కనగల్లులో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభం

04-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, ఫిబ్రవరి 4:

నాగార్జున ప్రభుత్వ కళాశాల, నల్లగొండ విద్యార్థినీ విద్యార్థులు నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్–3, యూనిట్–5 ఆధ్వర్యంలో కనగల్లు గ్రామంలో శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలకు పారిశుద్ధ్య కార్యక్రమాలు, అంటువ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.శిబిర ప్రారంభ సమావేశంలో గ్రామ సర్పంచ్ నర్సింగు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ, నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు గ్రామానికి రావడం ఆనందకరమని తెలిపారు. గ్రామ ప్రజలను చైతన్యపరచేలా వివిధ సామాజిక కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు.మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నేషనల్ సర్వీస్ స్కీమ్ సమన్వయకర్త ఎం. వెంకటరమణారెడ్డి పాల్గొని, శిబిర లక్ష్యాలు, కార్యక్రమాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని గ్రామస్థులకు ఉపయోగపడే విధంగా పని చేయాలని సూచించారు.ఈ సందర్భంగా కళాశాల ఉపప్రాచార్యులు డాక్టర్ పి. రవికుమార్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. మునిస్వామి మాట్లాడుతూ, విద్యార్థులు ముందుండి సామాజిక కార్యక్రమాలు నిర్వహించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సృజన కుమారి కూడా సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ శిబిరాన్ని నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్–3 కార్యక్రమ అధికారి డాక్టర్ అనిల్ కుమార్, యూనిట్–5 కార్యక్రమ అధికారి డాక్టర్ ఆదె మల్లేష్ ముందుండి నిర్వహించారు. కార్యక్రమంలో కనగల్లు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ రామకృష్ణ, ఉపసర్పంచ్ చంద్రయ్య, గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కనగల్లులో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News