Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:18 PM

కనగల్లు గ్రామంలో ఎన్ఎస్‌ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభం

04-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా కనగల్లు గ్రామంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. నాగార్జున ప్రభుత్వ కళాశాల జాతీయ సేవా పథకం మూడవ, ఐదవ విభాగాల ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.గ్రామ ప్రజలకు పారిశుద్ధ్యంపై, అంటువ్యాధుల నివారణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిర ప్రారంభ సమావేశంలో గ్రామ సర్పంచ్ నర్సింగు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ తమ గ్రామానికి కళాశాల విద్యార్థులు రావడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ ప్రజలను చైతన్యపరిచే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం సమన్వయకర్త వెంకటరమణారెడ్డి విద్యార్థులకు శిబిర లక్ష్యాలు, బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.నాగార్జున ప్రభుత్వ కళాశాల ఉపాధ్యక్షుడు డాక్టర్ పి రవికుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన అవసరమన్నారు. పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి మునిస్వామి మాట్లాడుతూ విద్యార్థులు ముందుండి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సృజన కుమారి సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ శిబిరాన్ని జాతీయ సేవా పథకం మూడవ విభాగం కార్యక్రమాధికారి డాక్టర్ అనిల్ కుమార్, ఐదవ విభాగం కార్యక్రమాధికారి డాక్టర్ ఆదె మల్లేష్ ముందుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుడు రామకృష్ణ, గ్రామ ఉపసర్పంచ్ చంద్రయ్య, గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

కనగల్లు గ్రామంలో ఎన్ఎస్‌ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News