Sthanikam - Truth Matters
Logo

కాలనీవాసుల విజ్ఞప్తికి తక్షణ స్పందన. వార్డు సమస్యను తీర్చిన సర్పంచ్, వార్డు సభ్యులు

Updated : 06 Feb 2026 06:46 IST
As Preferred Source 1 min read
కాలనీవాసుల విజ్ఞప్తికి తక్షణ స్పందన. వార్డు సమస్యను తీర్చిన సర్పంచ్, వార్డు సభ్యులు

నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాన్ని తక్షణమే గుర్తించి, కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు సమస్యను పరిష్కరించిన మాధవ ఎడవల్లి గ్రామ సర్పంచ్ కందకట్ల రజనీ యాదవ రెడ్డి, ఉపసర్పంచ్ పైళ్ల శ్రీనివాస్ రెడ్డి చర్యలు అభినందనీయమని గ్రామస్థులు ప్రశంసించారు.నార్కెట్‌పల్లి మండలంలోని మాధవ ఎడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మొదటి వార్డులో మానస రెసిడెన్సీ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో కాలనీవాసులు ఈ సమస్యను సర్పంచ్, ఉపసర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ప్రజాప్రతినిధులు గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి, మట్టి పోయించి రహదారిని సమతలంగా చేయిస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి తాము కూడా భాగస్వాములమవుతూ పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అడిగిన వెంటనే స్పందించి తమ కాలనీ సమస్యను పరిష్కరించినందుకు సర్పంచ్ కందకట్ల రజనీ యాదవ రెడ్డి, ఉపసర్పంచ్ పైళ్ల శ్రీనివాస్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు సామ మహేశ్వరి శాంతి రెడ్డి, కాలనీవాసులు శివకుమార్, కడారి శ్రీనివాస్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాలనీవాసుల విజ్ఞప్తికి తక్షణ స్పందన. వార్డు సమస్యను తీర్చిన సర్పంచ్, వార్డు సభ్యులు

Article Image

నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాన్ని తక్షణమే గుర్తించి, కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు సమస్యను పరిష్కరించిన మాధవ ఎడవల్లి గ్రామ సర్పంచ్ కందకట్ల రజనీ యాదవ రెడ్డి, ఉపసర్పంచ్ పైళ్ల శ్రీనివాస్ రెడ్డి చర్యలు అభినందనీయమని గ్రామస్థులు ప్రశంసించారు.నార్కెట్‌పల్లి మండలంలోని మాధవ ఎడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మొదటి వార్డులో మానస రెసిడెన్సీ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో కాలనీవాసులు ఈ సమస్యను సర్పంచ్, ఉపసర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ప్రజాప్రతినిధులు గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి, మట్టి పోయించి రహదారిని సమతలంగా చేయిస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి తాము కూడా భాగస్వాములమవుతూ పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అడిగిన వెంటనే స్పందించి తమ కాలనీ సమస్యను పరిష్కరించినందుకు సర్పంచ్ కందకట్ల రజనీ యాదవ రెడ్డి, ఉపసర్పంచ్ పైళ్ల శ్రీనివాస్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు సామ మహేశ్వరి శాంతి రెడ్డి, కాలనీవాసులు శివకుమార్, కడారి శ్రీనివాస్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి