Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం. నీలం మధు ముదిరాజ్

07-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అభివృద్ధి కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో హస్తానికే ఓటు

జుక్కల్,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన ఈ ప్రాంతం నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి బాట పట్టిందని తెలిపారు.కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం శివాజీ చౌక్ వద్ద శనివారం నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ నీలం మధు పాల్గొన్నారు. జుక్కల్ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. నమ్మి ఓటేసిన ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజాసేవలో ఉండాలని పిలుపునిచ్చారు.

సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని గుర్తు చేశారు. ఇదే ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయపతాకం ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని తెలిపారు.

అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఎన్నికలు పూర్తయ్యాక ఈ నిధులతో మౌలిక వసతుల కల్పన చేపట్టి ప్రతి వాడను అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం. నీలం మధు ముదిరాజ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News