Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:28 PM

జాతీయ సమైక్యతా శిబిరానికి రామన్నపేట విద్యార్థి

05-02-2026 216 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం వాలంటీర్ సాయి తేజ ఎంపిక

ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటకు చెందిన జాతీయ సేవా పథకం వాలంటీర్ నోముల సాయి తేజ జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపికయ్యాడు. కళాశాలలో బిఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాయి తేజ, ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఏడు రోజుల పాటు బీహార్ రాష్ట్రంలోని సస్రాంలో నిర్వహించనున్న జాతీయ సమైక్యతా శిబిరంలో పాల్గొననున్నాడు.జాతీయ సేవా పథకం వాలంటీర్ల నైపుణ్యాలు, సాంస్కృతిక ప్రతిభను పెంపొందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. సస్రాంలోని శాంతి ప్రసాద్ జైన్ కళాశాలలో జరిగే ఈ శిబిరానికి వాలంటీర్ల ఎంపిక ప్రక్రియలో సాయి తేజ సాంస్కృతిక అంశాల్లో ప్రతిభ కనబర్చి ఎంపికయ్యాడు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రహత్ ఖానం, ఉప ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, విద్యా సమన్వయకర్త డాక్టర్ జే. చిన్నబాబు, జాతీయ సేవా పథకం యూనిట్ ఒకటి కార్యక్రమ అధికారి తాటిశెట్టి శ్రీనివాసులు తదితర అధ్యాపక సిబ్బంది సాయి తేజను అభినందించారు. ఈ ఎంపికతో కళాశాలకు మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు.

Sthanikam

జాతీయ సమైక్యతా శిబిరానికి రామన్నపేట విద్యార్థి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News