Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:15 AM

జనన–మరణాల నమోదు పై కట్టుదిట్టమైన నిబంధనలు

19-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

21 రోజుల్లో నమోదు చేయకపోతే అపరాధ రుసుము

ఆలస్యంగా నమోదు చేస్తే జరిమానా… ప్రభుత్వం కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనన, మరణాల నమోదుకు సంబంధించిన కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతి జననం, మరణం నిర్దిష్ట కాలవ్యవధిలో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నమోదు ప్రక్రియను కచ్చితంగా అమలు చేసి గణాంకాల ఖచ్చితత్వం పెంచడం, ప్రజలకు సేవలు వేగంగా అందించడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చారు.

కొత్త నిబంధనల ప్రకారం పుట్టిన లేదా మరణించిన తేదీ నుంచి 21 రోజుల్లోపు నమోదు చేయడం తప్పనిసరి. ఈ గడువులో నమోదు చేయకపోతే ఆలస్యంగా నమోదు చేసుకునే వారికి అపరాధ రుసుములు విధించబడతాయి.

21 నుంచి 30 రోజుల మధ్య నమోదు చేస్తే రూ.25 అపరాధ రుసుము చెల్లించాలి.

30 రోజుల తర్వాత నుంచి ఒక సంవత్సరం లోపు నమోదు చేస్తే రూ.250 అపరాధ రుసుము విధించబడుతుంది.

అలాగే పుట్టిన శిశువుకు పేరు వెంటనే నమోదు చేయని సందర్భంలో తల్లిదండ్రులకు సడలింపు కల్పించారు. శిశువు పేరు 12 నెలల లోపు ఎప్పుడైనా ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ నిబంధనలపై గ్రామ, పట్టణ స్థాయి సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. జనన–మరణాల నమోదును నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పూర్తి చేయాలని ప్రజలను కోరుతున్నారు.

Sthanikam

జనన–మరణాల నమోదు పై కట్టుదిట్టమైన నిబంధనలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News