Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:46 AM

జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

09-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సూర్యాపేట మండలం పిల్లలమర్రి పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదామును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లు, ఈ–పాస్ యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన ఆయన, ఇప్పటివరకు పిల్లలమర్రి పీఏసీఎస్ ద్వారా 290.43 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామని, ప్రస్తుతం 11.90 మెట్రిక్ టన్నులు (266 బస్తాలు) యూరియా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు.ఈ యాసంగి సీజన్‌కు మరో 100 మెట్రిక్ టన్నుల యూరియా సరిపోతుందని, శుక్రవారం సాయంత్రం నాటికి మరో రెండు లారీల యూరియా లోడ్లు రానున్నాయని ఏడీఏ కలెక్టర్‌కు వివరించగా, అవసరమైనంత యూరియా సరఫరా చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

అనంతరం అక్కడున్న రైతులతో మాట్లాడిన కలెక్టర్, ఎరువుల సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక ఎకరం వరి సాగుకు సుమారు రూ.25 వేల వరకు ఖర్చవుతుందని, సగటున రూ.33 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాంప్రదాయ పంటలైన వరి సాగుతో పాటు అధిక లాభాలు వచ్చే పామాయిల్, కూరగాయల సాగు వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఓ ప్రవీణ్ కుమార్, తహసిల్దార్ కృష్ణయ్య, ఏడీఏ జ్ఞానేశ్వరి దేవి, ఏఏవో కృష్ణ సందీప్, ఏఈఓ

Sthanikam

జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News