Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:21 AM

ఇంద్రపాలనగరంలో పేద కుటుంబానికి సొంతింటి పండుగ… ఎమ్మెల్యే వేముల వీరేశం

20-02-2026 100 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన ఏర్వ మమత–గణేష్ దంపతుల సొంతింటి కల సాకారమైన వేళ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో వేముల వీరేశం పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు గృహాల పంపిణీ వేగవంతమైందని, గత పదేళ్ల పాలనలో పేదలకు గృహాల కేటాయింపులో నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు.

నకిరేకల్ నియోజకవర్గానికి తొలి విడతగా 3,500 ఇండ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇండ్లు లేని ప్రతి అర్హ కుటుంబానికి విడతల వారీగా గృహాలు అందజేసి, వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పేదల జీవన ప్రమాణాల మెరుగుదల ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై గృహప్రవేశ వేడుకను పండుగ వాతావరణంలో నిర్వహించారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో పేద కుటుంబానికి సొంతింటి పండుగ… ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News