Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:21 AM

హెల్మెట్ లేకుంటే పెట్రోల్‌కు నో... కలెక్టర్ హనుమంతరావు

21-02-2026 185 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,: జిల్లాలో రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ విక్రయించవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్ యజమానులు, నిర్వాహకులు కచ్చితంగా ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు.

హెల్మెట్ లేకుండా పెట్రోల్ కోసం వచ్చే ద్విచక్ర వాహనదారులకు ముందుగా అవగాహన కల్పించి, హెల్మెట్ ధరించిన తర్వాతే పెట్రోల్ నింపాలని సూచించారు. పెట్రోల్ బంక్ ప్రాంగణంలో ‘హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు’ అనే స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత సిబ్బందికి కూడా ఈ నిర్ణయంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆదేశాలను పాటించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Sthanikam

హెల్మెట్ లేకుంటే పెట్రోల్‌కు నో... కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News