Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 10:39 AM

హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!

హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!

హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!
31-01-2026 635 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానవ విలువలు ఎటు పోతున్నాయి?

మనవత్వాన్ని సైతం ప్రశ్నించే దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు సొంత చెల్లెలిని హత్య చేసి, వారి మృతదేహాలను ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగర జిల్లా కొట్టూరులో జరిగిన ఈ సంఘటన శుక్రవారం బయటపడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.పోలీసుల సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదాలే ఈ అమానుష ఘటనకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కుటుంబ బంధాలే బలహీనపడుతున్న ఈ రోజుల్లో, సొంత రక్త సంబంధాలనే హత్య చేయడం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.ఇట్లోనే మృతదేహాలను పూడ్చిపెట్టడం ద్వారా నేరాన్ని దాచిపెట్టాలని నిందితుడు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటన మానవ విలువలు, కుటుంబ సంబంధాల ప్రాధాన్యతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకప్పుడు బంధుత్వాలు, అనురాగాలే జీవితానికి ఆధారంగా నిలిచిన సమాజంలో, ఇలాంటి ఘోరాలు చోటుచేసుకోవడం మనం ఏ దిశగా ప్రయాణిస్తున్నామన్న ఆలోచనకు దారితీస్తోంది.మానవ విలువలు ఎటు పోతున్నాయి? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Sthanikam

హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News