Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:23 AM

హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధం – జోగు అంజన్న

18-02-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉద్యమకారుల హామీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న విమర్శించారు. బుధవారం వలిగొండలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రెండున్నర సంవత్సరాలు గడిచినా ఉద్యమకారుల సమస్యలపై ఒక్క కమిటీ కూడా నియమించకపోవడం, తొలి దశ–మలిదశ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించకపోవడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేస్తూ వాయిదా వేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం నెలకొన్నదన్నారు.

ఉద్యమ కాలంలో విశేషంగా సేవలందించిన పలువురు ఉద్యమకారులు గత కొన్నేళ్లలో మరణించినప్పటికీ వారికి సరైన గుర్తింపు, సాయసహాయాలు అందకపోవడం బాధాకరమని అంజన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి హామీల అమలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Sthanikam

హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధం – జోగు అంజన్న

Article Image

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉద్యమకారుల హామీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న విమర్శించారు. బుధవారం వలిగొండలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రెండున్నర సంవత్సరాలు గడిచినా ఉద్యమకారుల సమస్యలపై ఒక్క కమిటీ కూడా నియమించకపోవడం, తొలి దశ–మలిదశ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించకపోవడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేస్తూ వాయిదా వేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం నెలకొన్నదన్నారు.

ఉద్యమ కాలంలో విశేషంగా సేవలందించిన పలువురు ఉద్యమకారులు గత కొన్నేళ్లలో మరణించినప్పటికీ వారికి సరైన గుర్తింపు, సాయసహాయాలు అందకపోవడం బాధాకరమని అంజన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి హామీల అమలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News