Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:29 PM

హాలియాలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం. కొండేటి మల్లయ్య

07-02-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపు

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా పట్టణకేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మొదటి వార్డు అభ్యర్థి గౌని రాజా రమేష్, రెండో వార్డు అభ్యర్థి నకిరేకంటి అన్నపూర్ణ సైదులు విజయం కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారంలో నాగార్జున సాగర్ శాసనసభ్యుడు కుందూరు జైవీర్ రెడ్డి పాల్గొని ప్రజలను కలిశారు. అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఎన్నికలు స్థానిక అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే హాలియా పట్టణం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

హాలియాలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం. కొండేటి మల్లయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News