Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:22 AM

హైకోర్టు తీర్పుతో ఉద్యమకారులకు న్యాయం — రెబ్బాస్ రాములు హర్షం

23-02-2026 151 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, తెలంగాణ ఉద్యమకారులకు అనుకూలంగా వెలువడిన తీర్పుపై ఉద్యమకారుడు రెబ్బాస్ రాములు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకాలంలో త్యాగాలు చేసిన వారికి ఇది న్యాయం చేసిన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి, అనేక మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం తగిన స్థాయిలో సహకారం అందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఉద్యమకారులకు ఎనిమిది వారాల లోపు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని సంబంధిత శాఖలను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంతోషకరమని తెలిపారు.

ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి విజయసేన్ రెడ్డికు రెబ్బాస్ రాములు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఈ తీర్పు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

హైకోర్టు తీర్పుతో ఉద్యమకారులకు న్యాయం — రెబ్బాస్ రాములు హర్షం

Article Image

రామన్నపేట, తెలంగాణ ఉద్యమకారులకు అనుకూలంగా వెలువడిన తీర్పుపై ఉద్యమకారుడు రెబ్బాస్ రాములు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకాలంలో త్యాగాలు చేసిన వారికి ఇది న్యాయం చేసిన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి, అనేక మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం తగిన స్థాయిలో సహకారం అందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఉద్యమకారులకు ఎనిమిది వారాల లోపు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని సంబంధిత శాఖలను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంతోషకరమని తెలిపారు.

ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి విజయసేన్ రెడ్డికు రెబ్బాస్ రాములు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఈ తీర్పు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News