Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:29 PM

గొట్టిపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన; మార్కెట్ వైస్ చైర్మన్ వెంకన్న, సర్పంచ్ మంజుల

13-04-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తిమండలం గొట్టిపర్తి గ్రామంలో నిర్వహించిన ఐకెపి 1, ఐకెపి 2, ధాన్యం కొనుగోలు కేంద్రానీ తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సర్పంచ్ చిలుకల మంజుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి క్వింటాకు 500 బోనస్ అందిస్తున్నట్లు గుర్తు చేశారు. రైతులకు ఉచిత కరెంట్, రుణ మాఫీ, రైతు భరోసా, 500 బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. అందుకోసమే రాష్ట్రంలో సన్నాలు పండించే రైతులను ప్రోత్సహస్తుందని అన్నారు. దీనివల్ల మన రైతుల వద్దనే సన్నాలు కొని మళ్ళీ మనకే సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందువలన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్మాలని సూచించారు. తేమ 17 శాతం ఉండాలని, బస్తా 41 కేజీలు మాత్రమే తూకం వేయాలని ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపీఎం యాదమ్మ, ఉప సర్పంచ్ శ్రీకాంత్ ,cc, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్న,ఐకెపి నిర్వాకులు రజిత, శ్వేత, రమ, హైమవతి, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన; మార్కెట్ వైస్ చైర్మన్ వెంకన్న, సర్పంచ్ మంజుల

Article Image

తుంగతుర్తిమండలం గొట్టిపర్తి గ్రామంలో నిర్వహించిన ఐకెపి 1, ఐకెపి 2, ధాన్యం కొనుగోలు కేంద్రానీ తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సర్పంచ్ చిలుకల మంజుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి క్వింటాకు 500 బోనస్ అందిస్తున్నట్లు గుర్తు చేశారు. రైతులకు ఉచిత కరెంట్, రుణ మాఫీ, రైతు భరోసా, 500 బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. అందుకోసమే రాష్ట్రంలో సన్నాలు పండించే రైతులను ప్రోత్సహస్తుందని అన్నారు. దీనివల్ల మన రైతుల వద్దనే సన్నాలు కొని మళ్ళీ మనకే సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందువలన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్మాలని సూచించారు. తేమ 17 శాతం ఉండాలని, బస్తా 41 కేజీలు మాత్రమే తూకం వేయాలని ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపీఎం యాదమ్మ, ఉప సర్పంచ్ శ్రీకాంత్ ,cc, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్న,ఐకెపి నిర్వాకులు రజిత, శ్వేత, రమ, హైమవతి, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News