Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:22 AM

గంటలోనే రూ.6 లక్షల బంగారం బ్యాగ్‌ వెతికి అందించిన ఆదోని పోలీసులు!

18-02-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ తన బ్యాగ్‌ను బస్సులోనే మరిచిపోయి దిగిన ఘటనలో, ఆదోని టౌన్ పోలీసులు శీఘ్రంగా స్పందించి విలువైన బంగారు ఆభరణాలను ఆమెకు అప్పగించారు.

విశాల్ మార్ట్ వద్ద బస్సు దిగిన అనంతరం బ్యాగ్ గుర్తుకు రావడంతో బాధితురాలు ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినా బ్యాగ్ దొరకకపోవడంతో సాయంత్రం 3.30 గంటలకు ఆదోని ఐ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సీఐ పి . చంద్రశేఖర్ఆ దేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మానంద రెడ్డి, కానిస్టేబుల్ సజ్జన్, విజయ్ కుమార్‌లు సీసీ ఫుటేజీలు పరిశీలించి, డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పట్టణంలో గాలింపు చేపట్టారు. సాయంత్రం 4.30 గంటలకు బ్యాగ్‌ను గుర్తించి బాధితురాలికి అందజేశారు.

బ్యాగ్‌లో సుమారు రూ.6 లక్షల విలువైన నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వేగవంతమైన చర్యలతో విలువైన ఆభరణాలు తిరిగి అందించడంపై స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Sthanikam

గంటలోనే రూ.6 లక్షల బంగారం బ్యాగ్‌ వెతికి అందించిన ఆదోని పోలీసులు!

Article Image

ఆదోని: కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ తన బ్యాగ్‌ను బస్సులోనే మరిచిపోయి దిగిన ఘటనలో, ఆదోని టౌన్ పోలీసులు శీఘ్రంగా స్పందించి విలువైన బంగారు ఆభరణాలను ఆమెకు అప్పగించారు.

విశాల్ మార్ట్ వద్ద బస్సు దిగిన అనంతరం బ్యాగ్ గుర్తుకు రావడంతో బాధితురాలు ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినా బ్యాగ్ దొరకకపోవడంతో సాయంత్రం 3.30 గంటలకు ఆదోని ఐ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సీఐ పి . చంద్రశేఖర్ఆ దేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మానంద రెడ్డి, కానిస్టేబుల్ సజ్జన్, విజయ్ కుమార్‌లు సీసీ ఫుటేజీలు పరిశీలించి, డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పట్టణంలో గాలింపు చేపట్టారు. సాయంత్రం 4.30 గంటలకు బ్యాగ్‌ను గుర్తించి బాధితురాలికి అందజేశారు.

బ్యాగ్‌లో సుమారు రూ.6 లక్షల విలువైన నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వేగవంతమైన చర్యలతో విలువైన ఆభరణాలు తిరిగి అందించడంపై స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News