Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:23 AM

గంధమల్ల రిజర్వాయర్ బాధిత రైతులకు ₹22.80 కోట్ల పరిహారం చెక్కులు పంపిణీ

18-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు, : గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య తెలిపారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు , అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి 412 మంది రైతులకు ఎకరానికి రూ.24 లక్షల 50 వేల చొప్పున 87 ఎకరాలకు గాను మొత్తం రూ.22 కోట్ల 80 లక్షల 58 వేల పరిహారం చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంతో ఎనిమిది మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు తగిన పరిహారం అందజేసినట్లు చెప్పారు. రిజర్వాయర్ పూర్తయ్యాక ఉపాధి అవకాశాల్లో కూడా బాధిత కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. భూ సేకరణలో రైతులకు భారీ మొత్తంలో పరిహారం అందించడంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, ఈ పరిహారం రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ రవీందర్, ఈఈ రఘునాథ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, తుర్కపల్లి ఎమ్మార్వో జలకుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

గంధమల్ల రిజర్వాయర్ బాధిత రైతులకు ₹22.80 కోట్ల పరిహారం చెక్కులు పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News