Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Updated : 17 Feb 2026 16:25 IST
As Preferred Source 1 min read
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

హాజరైన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో

బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –

స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా 12 ఏళ్లు శాంతియుత మార్గంలో అలుపెరుగని పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు.

సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి కరువు నేలను సిరుల తెలంగాణగా మార్చి దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థాయిలో నిలిపారని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి