చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలను పురపాలక వర్గం, అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ పాలకవర్గం, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు విశేష సంఖ్యలో హాజరై చైర్‌పర్సన్ పావనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్.ఓ. అంజయ్య, కార్యాలయ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు అందించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు, అధికారులు మాట్లాడుతూ.. చైర్‌పర్సన్ పావని మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజాసేవలో ముందంజలో ఉంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొసనం రాజేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి, పల్లె లావణ్య, బద్రి గాలయ్య, దేప రమ్య, పాక చిరంజీవి, ఉడుగు జ్యోతి, బత్తుల జయమ్మ, చింతల ఉమామహేశ్వరి, బుడ్డా సురేష్, పిల్లలమర్రి మధుసూధన్, హన్ను మహమ్మద్, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగరాములు, మహమ్మద్ బాబా షరీఫ్, షేక్ నబీబి, సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ దీప, వార్డ్ ఆఫీసర్లు, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, కార్యాలయ సిబ్బంది శ్రీకాంత్, భరత్, బుచ్చి రాములు, ఉపేందర్, రవి, శ్యామ్, సునీత, భాస్కర్, అరవింద్, అంజయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి