మునగాల మండలం పరిధిలోని ఎస్ఎంపేట గ్రామంలో సోమవారం సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
సభాస్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో వేదిక, ప్రేక్షకుల సీటింగ్, పార్కింగ్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవలకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా అధికారులతో సమీక్షించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు, ఇతర అధికార యంత్రాంగం పాల్గొని సభాస్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి