డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రుల పర్యటన నేపథ్యంలో మునగాల లో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పర్యటన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తహసిల్దార్ సరిత, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై సంజీవరెడ్డి తదితర అధికారులు పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మునగాల మండల పరిధిలోని ఎస్ఎంపేట గ్రామంలో సోమవారం పర్యటన జరిగే ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన చర్యలను అధికారులు పరిశీలించారు.కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, నాయకులు, అధికారులు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.అలాగే పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
డిప్యూటీ సీఎం,మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి