రైతులు పంటల సాగులో నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలని వసంత్ పత్తి విత్తనాల సంస్థ ఆర్‌ఎం శివశంకర్‌రెడ్డి సూచించారు. సోమవారం మనూర్ మండలంలోని రాణాపూర్ గ్రామ శివారులో రైతు సుభాష్‌రావు పాటిల్ పొలంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన రకం విత్తనాలను వినియోగించడం ద్వారా తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. రైతులు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి నష్టపోకుండా, విత్తనాల నాణ్యతను పరిశీలించి నమ్మకమైన విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని సూచించారు. పంట సాగులో సరైన పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను ఉపయోగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర అధికారి విఠల్, శేరి శ్రీనివాస్, గాండ్ల రాజ్‌కుమార్, ఈశ్వర్‌గౌడ్, పండారి రెడ్డి, నాగేందర్‌రావు పాటిల్, గణపతి, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మంచి దిగుబడికి నాణ్యమైన విత్తనాలే కీలకం
మంచి దిగుబడికి నాణ్యమైన విత్తనాలే కీలకం
Krishna
రైతులు పంటల సాగులో నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలని వసంత్ పత్తి విత్తనాల సంస్థ ఆర్‌ఎం శివశంకర్‌రెడ్డి సూచించారు. సోమవారం మనూర్ మండలంలోని రాణాపూర్ గ్రామ శివారులో రైతు సుభాష్‌రావు పాటిల్ పొలంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన రకం విత్తనాలను వినియోగించడం ద్వారా తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. రైతులు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి నష్టపోకుండా, విత్తనాల నాణ్యతను పరిశీలించి నమ్మకమైన విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని సూచించారు. పంట సాగులో సరైన పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను ఉపయోగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర అధికారి విఠల్, శేరి శ్రీనివాస్, గాండ్ల రాజ్‌కుమార్, ఈశ్వర్‌గౌడ్, పండారి రెడ్డి, నాగేందర్‌రావు పాటిల్, గణపతి, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి