రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులను మాత్రమే విక్రయించాలని కోదాడ సహాయ వ్యవసాయ సంచాలకురాలు (ఏడీఏ) పి. ప్రశాంతి డీలర్లకు సూచించారు.
మునగాల మండలంలో సోమవారం పలు ప్రైవేట్ ఎరువులు, పురుగుమందుల దుకాణాలతో పాటు సహకార సంఘాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, ఎరువులు, పురుగుమందుల నిల్వలను పరిశీలించారు.
ప్రతిరోజూ జరిగే ఎరువులు, పురుగుమందుల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన వివరాలను రికార్డుల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని డీలర్లకు సూచించారు. రైతులకు విక్రయించే ప్రతి ఉత్పత్తికి తప్పనిసరిగా అన్ని వివరాలతో కూడిన బిల్లును అందించాలని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించే ఎరువులు, పురుగుమందులను మాత్రమే రైతులకు విక్రయించాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి. రాజు, డీలర్లు ప్రసాద్, రాజేష్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి