Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పబ్బు వజ్రమ్మ జ్ఞాపకార్థం పేద విద్యార్థినికి రూ.25 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 07:32 PM

పత్తి రైతులకు మరింత పారదర్శక సేవలు

పత్తి రైతులకు మరింత పారదర్శక సేవలు

పత్తి రైతులకు మరింత పారదర్శక సేవలు
05-10-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: పత్తి రైతులకు సాధికారత కల్పిస్తూ పత్తి విలువ శ్రేణిని బలోపేతం చేసేందుకు సంస్కరణలు చేపడుతున్నట్లు కేంద్ర జౌళి శాఖ తెలిపింది. సంస్కరణల ఉత్సవ్‌–2026లో భాగంగా భారత పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో అక్టోబర్‌ 6న హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నారు. పత్తి కొనుగోళ్లలో డిజిటలీకరణ, నాణ్యతా ప్రమాణాల పెంపు, ట్రేసబిలిటీ, రైతులకు నేరుగా చెల్లింపులు వంటి అంశాలను ఇందులో ప్రదర్శించనున్నారు.

డిజిటల్‌ విధానానికి ప్రాధాన్యం

రైతుల నమోదు, స్లాట్‌ బుకింగ్‌, పత్తి సేకరణ, ఆధార్‌ ఆధారిత చెల్లింపులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ‘కపాస్‌ కిసాన్‌’ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రదర్శించనున్నారు. దీనివల్ల కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు సులభతరం కానుంది.పత్తి నాణ్యతను పెంచేందుకు కలుషితాల నియంత్రణ, డిజిటల్‌ ట్రేసబిలిటీ, ‘కస్తూరి కాటన్‌ భారత్‌’ కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే హై డెన్సిటీ ప్లాంటింగ్‌ సిస్టమ్‌ (హెచ్‌డీపీఎస్‌) ద్వారా ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచే చర్యలపై చర్చించనున్నారు.

కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, రైతులు, పారిశ్రామిక ప్రతినిధులు, పత్తి–జౌళి రంగ భాగస్వాములు పాల్గొని సంస్కరణల ఫలితాలు, అనుభవాలను పంచుకోనున్నారు. రైతులకు మరింత పారదర్శక సేవలు

Sthanikam

పత్తి రైతులకు మరింత పారదర్శక సేవలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News