రాయికోడ్ మండలంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్దలు, కార్యకర్తల సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని నూతన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ల కేదారినాథ్ పాటిల్ తెలిపారు. సోమవారం నల్లంపల్లి చౌరస్తాలోని పట్లోళ్ల ఫంక్షన్ హాల్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. ఆంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. ఆంజయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన మండల నాయకులు సిద్దన్న పాటిల్, బస్వరాజ్ పాటిల్‌తో పాటు నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని, ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలు తీసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. ఆంజయ్య మాట్లాడుతూ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తను అధిష్టానం గుర్తించి తగిన సమయంలో మంచి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. అనంతరం నూతన మండల అధ్యక్షుడు కేదారినాథ్ పాటిల్‌ను శాలువాతో సన్మానించారు. ఇప్పటివరకు మండల అధ్యక్షుడిగా సేవలందించిన బాలాజీ నర్సింలును సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు.
అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి: కేదారినాథ్

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి