Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా చౌటుప్పల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 08:32 PM

రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు దండు మల్కాపురం విద్యార్థులు ఎంపిక

05-10-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూ డైమెన్షన్స్ పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్‌బాల్ ఎంపిక పోటీల్లో దండు మల్కాపురం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.​అండర్-17 బాలురు అజయ్ కుమార్, ఏ. జస్వంత్. వీరు ఈ నెల 12 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారు. ​అండర్-17 బాలికలు యు. శ్రీజ, యు. మేఘన, బి. నిత్య. ​అండర్-14 బాలికలు రస్మిక, ఎస్. జాష్ణవి, అక్షిత, తన్మైశ్రీ. ​అండర్-14 బాలురు ఎస్. అరవింద్.​మిగతా అండర్-17 బాలికలు, అండర్-14 విభాగానికి చెందిన విద్యార్థులు వచ్చే నెల మంచిర్యాల జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఉపాధ్యాయులు తెలిపారు. ​క్రీడల్లో రాణించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తెచ్చిన విద్యార్థులను చౌటుప్పల్ ఎంఈఓ గురువారావు, గ్రామ సర్పంచి గిర్కటి నిరంజన్ గౌడ్, ఉపసర్పంచి నరసింహ, హెచ్‌ఎం శోభ, పీడీ భావన, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.

Sthanikam

రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు దండు మల్కాపురం విద్యార్థులు ఎంపిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News