Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 06, 2026 05:24 AM

ప్రజా అవసరాలకు అనుగుణంగా గ్రామపంచాయతీ భవనం

06-10-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

చిలుకూరు మండలం ఆర్లెగూడెం గ్రామంలో రూ.20 లక్షల MGNREGS నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన భవనాన్ని పరిశీలించి, పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన పంచాయతీ భవనం అందుబాటులోకి రావడంతో గ్రామపంచాయతీ పరిపాలన మరింత సౌకర్యవంతంగా సాగడంతో పాటు, వివిధ ప్రభుత్వ సేవల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.

గ్రామంలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ

కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా అవసరాలకు అనుగుణంగా గ్రామపంచాయతీ భవనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News