Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా చౌటుప్పల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 08:27 PM

మధ్యవర్తులు అవసరం లేదు.. నేరుగా ఎస్పీకి ఫిర్యాదు

05-10-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి చట్టపరమైన పరిష్కారం అందించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విని ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి చట్టపరమైన పరిష్కారం, సత్వర న్యాయం పొందేందుకు ప్రజావాణి మంచి వేదికగా నిలుస్తుందని ఎస్పీ తెలిపారు.

Sthanikam

మధ్యవర్తులు అవసరం లేదు.. నేరుగా ఎస్పీకి ఫిర్యాదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News