భవిష్యత్తు దార్శనికులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం పాఠశాల ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు అన్నారు. సోమవారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
సమాజ నిర్మాణానికి అవసరమైన నైపుణ్యాలు, విలువలు, మంచి వ్యక్తిత్వాన్ని విద్యార్థుల్లో పెంపొందించాల్సిన బాధ్యత గురువులదేనని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయుడే ప్రధాన మార్గదర్శి అని తెలిపారు.
విద్యార్థుల ఆలోచనా విధానాన్ని, ప్రతిభను సరైన దిశలో నడిపిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో గురువుల పాత్ర అనిర్వచనీయమని అన్నారు. సమాజంలో ఉపాధ్యాయులకు తగిన గౌరవం, గుర్తింపు లభించాలని భరత్ బాబు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి