Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా చౌటుప్పల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 08:27 PM

హెచ్‌ఎండీఏ లే అవుట్ల పనులు వేగవంతం.. రైతులకు త్వరలో ప్లాట్లు

05-10-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి నియోజకవర్గంలోని ఆరుట్ల, ఫసల్‌వాది, కంది ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ భూసమీకరణ లే అవుట్లపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డితో పాటు హెచ్‌ఎండీఏ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో భూములు ఇచ్చిన రైతులకు ధ్రువపత్రాలు అందించినప్పటికీ, ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరుగుతుండటంపై జగ్గారెడ్డి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరుట్లలో లే అవుట్‌ పనులు పూర్తయినప్పటికీ లబ్ధిదారుల జాబితా రావాల్సి ఉందని, ఫసల్‌వాదిలో భూసేకరణ ప్రక్రియ సుమారు 60 శాతం పూర్తయిందని, కందిలో 50 ఎకరాలకు ప్రతిపాదించిన లే అవుట్‌కు ప్రస్తుతం 46 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. భూములు కోల్పోయిన రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నందున మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ప్లాట్లు కేటాయించాలని జగ్గారెడ్డి సూచించారు. నవంబర్‌ చివరికల్లా ఆరుట్ల, ఫసల్‌వాది, కంది లే అవుట్లలో అర్హులైన రైతులకు ప్లాట్లు కేటాయించేలా పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అధికారులను ఆదేశించారు. హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్‌ సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.

Sthanikam

హెచ్‌ఎండీఏ లే అవుట్ల పనులు వేగవంతం.. రైతులకు త్వరలో ప్లాట్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News