చిలుకూరు మండలంలోని MRC ప్రాంగణంలో సమగ్ర శిక్ష నిధులు రూ.9 లక్షలతో నిర్మించిన భవిత సెంటర్‌ను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంటర్‌లోని సౌకర్యాలను పరిశీలించిన ఆమె, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు మెరుగైన విద్య, శిక్షణ, సహాయక సేవలు అందించేందుకు భవిత సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ
కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి