చిట్యాల: క్రీడల్లో సత్తా చాటిన చిట్యాల గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికయ్యారు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని అనురాగ్ యూనివర్సిటీలో అక్టోబర్ 4న నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో సబ్‌జూనియర్ బాలికల విభాగంలో కొత్తపల్లి సహస్ర, బాలుర విభాగంలో షేక్ సోను సోహెల్ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికయ్యారు.
వీరు అక్టోబర్ 30, 31, నవంబర్ 1 తేదీల్లో పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగే జాతీయస్థాయి త్రోబాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జాతీయస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
జాతీయస్థాయికి ఎంపికైన సహస్ర, సోను సోహెల్‌ను పాఠశాల ఏవో పోల గోవర్ధన్, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము, ఉపాధ్యాయులు అభినందించారు. వారి క్రీడా ప్రస్థానం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి