తల్లిపై ఉన్న ప్రేమను, ఆమె సేవానిరతిని చాటుకుంటూ మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ విద్యార్థినికి ఆర్థిక చేయూతనందించారు. ఇటీవల పరమపదించిన ఆయన మాతృమూర్తి కీర్తిశేషులు పబ్బు వజ్రమ్మ దశదినకర్మ సందర్భంగా గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఒక సేవా విభాగాన్ని చేపట్టారు. వజ్రమ్మ జ్ఞాపకార్థం మల్కాపురం గ్రామానికి చెందిన ఓ పేద విద్యార్థిని ఉన్నత చదువుల కోసం రూ.25,000 నగదు సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థిని ఉన్నత చదువులు విజయవంతంగా పూర్తి చేసి సమాజంలో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లి జ్ఞాపకార్థం పేద విద్యార్థి చదువుకు ఆసరాగా నిలవడం పట్ల కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు రాజు గౌడ్‌ను అభినందించారు.
PRINT TIME: October 05, 2026 08:28 PM
పబ్బు వజ్రమ్మ జ్ఞాపకార్థం పేద విద్యార్థినికి రూ.25 వేల ఆర్థిక సాయం

05-10-2026
86 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
తల్లిపై ఉన్న ప్రేమను, ఆమె సేవానిరతిని చాటుకుంటూ మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ విద్యార్థినికి ఆర్థిక చేయూతనందించారు. ఇటీవల పరమపదించిన ఆయన మాతృమూర్తి కీర్తిశేషులు పబ్బు వజ్రమ్మ దశదినకర్మ సందర్భంగా గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఒక సేవా విభాగాన్ని చేపట్టారు. వజ్రమ్మ జ్ఞాపకార్థం మల్కాపురం గ్రామానికి చెందిన ఓ పేద విద్యార్థిని ఉన్నత చదువుల కోసం రూ.25,000 నగదు సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థిని ఉన్నత చదువులు విజయవంతంగా పూర్తి చేసి సమాజంలో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లి జ్ఞాపకార్థం పేద విద్యార్థి చదువుకు ఆసరాగా నిలవడం పట్ల కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు రాజు గౌడ్‌ను అభినందించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి