Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:45 AM

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

11-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రజల్లో ఉన్న ఆందోళనను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే అమాయకులనే లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తక్షణమే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనపు సిలిండర్లు అందిస్తామని సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. అలాగే వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని వచ్చే సందేశాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అలాంటి లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని స్పష్టం చేశారు.

గ్యాస్ సిలిండర్ బుకింగ్ లేదా చెల్లింపులు చేయాలనుకునే వారు సంబంధిత గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లు లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని తెలిపారు. ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటి వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని హెచ్చరించారు.

నకిలీ వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేస్తే వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. ఫలితంగా బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు కోల్పోయే అవకాశముందని హెచ్చరించారు.

ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 కు కాల్ చేయాలని సూచించారు. అలాగే cybercrime.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Sthanikam

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News