Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:37 PM

గ్రామాల్లో పులి సంచారం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

03-02-2026 230 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలోని కొన్ని గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు.మంగళవారం రాజాపేట మండలం బసంతాపూర్ గ్రామంలో గత రాత్రి పులి దాడిలో మృతి చెందిన లేగ దూడ సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ అధికారులతో పులి సంచారం, నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల గ్రామాల సమీపంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. పులి కదలికలను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్‌ల ద్వారా వీడియో చిత్రీకరణ, ట్రాప్ కెమెరాల ఏర్పాటు, అలాగే పులిని బంధించేందుకు ప్రత్యేక బోన్ల ఏర్పాటు చేసినట్లు అటవీ అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, వ్యవసాయ పనుల కోసం వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని సూచించారు. అలాగే రాత్రి సమయంలో పశువులను బయటికి వదలకుండా, పశువుల పాకలో తగిన వెలుతురు ఉండేలా చూసుకోవాలని అన్నారు.

పులి కనిపించినట్లుగా గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులు లేదా స్థానిక గ్రామ పోలీసులకు సమాచారం అందించాలని, పులికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేయరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం, అటవీ శాఖ సిబ్బంది పులి అడుగు జాడలను నిరంతరం గమనిస్తూ, దానిని పట్టుకొని అడవిలోకి పంపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రజలు భయాందోళనకు గురి కాకుండా, అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Sthanikam

గ్రామాల్లో పులి సంచారం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News