Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 04:12 PM

గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు చీఫ్ మినిస్టర్స్ కప్ పోటీలు

08-01-2026 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో నిర్వహించనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ – 2025 (2వ ఎడిషన్) క్రీడా పోటీల పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని విస్తరించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 8 నుంచి 17 వరకు పది రోజుల పాటు టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు క్రీడల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ ర్యాలీని చేపట్టనున్నారు.టార్చ్ ర్యాలీ అనంతరం దశలవారీగా పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు జరగనున్నాయి.గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని దశల్లో కలిపి మొత్తం 44 రకాల క్రీడల్లో శాట్స్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులకు ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక కల్పించడమే కాకుండా, భవిష్యత్ స్థాయి క్రీడాకారులను గుర్తించడమే ఈ కార్యక్రమ లక్ష్యంగా పేర్కొన్నారు.డిసెంబర్ నెలలో నిర్వహించాల్సిన ఈ క్రీడా పోటీలు వివిధ కారణాలతో వాయిదా పడగా, తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగనున్నాయి.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, SATG ఎండీ సోనీబాలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు చీఫ్ మినిస్టర్స్ కప్ పోటీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News