Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 02:09 PM

గ్రామగ్రామాన మహిళా సమాఖ్య భవనాలు,మహిళా సంఘాలకు రూ.10 లక్షల

30-12-2025 1,554 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చెట్ల కింద సమావేశాలకు చెక్

మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు

యాదాద్రి భువనగిరి స్థానికం ప్రతినిధి

ఉపాధిహామీ నిధులతో గ్రామగ్రామాన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసింది. జిల్లాలో ఉన్న 561 గ్రామ సమాఖ్యల్లో ఇప్పటివరకు 256 గ్రామాల్లో స్థలాలను అధికారులు గుర్తించారు. మిగతా గ్రామాల్లో కూడా ఒకటి రెండు రోజుల్లో స్థలాల గుర్తింపు పూర్తయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం మహిళా స్వయం సహాయక సంఘాలు ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, చెట్ల కింద సమావేశాలు నిర్వహించాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. ఉపాధిహామీ నిధులతో 200 గజాల స్థలంలో కనీసం 552 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు.

స్థలాల గుర్తింపు అనంతరం గ్రామ సభలో తీర్మానం చేసి గ్రామ పంచాయతీ ద్వారా ప్రతిపాదనలు పంపనున్నారు. ఎంపీడీఓ, డీఆర్‌డీఏ అధికారుల తనిఖీ అనంతరం కలెక్టర్ పరిపాలనా అనుమతులు జారీ చేస్తారు. భవన నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు అప్పగించే అవకాశం ఉంది.

మహిళా సమాఖ్య భవనాలు మహిళా సాధికారతకు, ఆత్మగౌరవానికి కేంద్రాలుగా నిలవనున్నాయని అధికారులు తెలిపారు.

Sthanikam

గ్రామగ్రామాన మహిళా సమాఖ్య భవనాలు,మహిళా సంఘాలకు రూ.10 లక్షల

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News