Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:20 AM

గణిత పాఠం చెప్పిన కలెక్టర్… ఆశ్చర్యపోయిన విద్యార్థులు!

18-02-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలో భాగంగా బుధవారం యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సందర్శించారు. అయితే ఈ తనిఖీ ప్రత్యేకత ఏమిటంటే… కలెక్టర్ స్వయంగా గణిత ఉపాధ్యాయుడిగా మారి పదవ తరగతి విద్యార్థులకు పాఠం బోధించడం!

పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య, పదవ తరగతి చదువుతున్న వారి వివరాలు, సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తయిందా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా? ఉదయం 5 గంటలకు విద్యార్థులకు వేకప్ కాల్ ఇస్తున్నారా? అంటూ ఉపాధ్యాయులను ప్రశ్నించారు.

అనంతరం 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి గణితంలో సూటి ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సమాధానాలు చెప్పిన తర్వాత బోర్డు పై స్వయంగా సమస్యలను పరిష్కరిస్తూ సులభంగా అర్థమయ్యే విధంగా బోధించారు. కలెక్టర్ బోధనకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు.

“పదవ తరగతి జీవితాన్ని మలిచే మొదటి మెట్టు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదివితే 100 శాతం ఉత్తీర్ణత సాధించవచ్చు. వెనుకబడిన సబ్జెక్టులపై మరింత శ్రద్ధ పెట్టాలి. స్వయంగా వ్రాసి సాధన చేయాలి” అని సూచించారు.

“బీద కుటుంబం నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది చదువే. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందుతోంది. ప్రతి గ్రామంలో ప్రతి విద్యార్థి ప్రభుత్వ బడిలోనే చదువుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి” అని కలెక్టర్ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

గణిత పాఠం చెప్పిన కలెక్టర్… ఆశ్చర్యపోయిన విద్యార్థులు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News