Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంధువులు, స్నేహితుల మధ్య మానస జన్మదిన వేడుకలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 08:51 PM

గడువులోపు పనులు పూర్తి చేయాలి… జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

17-02-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ హనుమంత రావు కఠినంగా స్పందించారు. నిర్ణీత గడువులోపు పనులు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను నిలదీశారు.

మంగళవారం కలెక్టరేట్‌లో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, మంజూరైన పనుల ప్రగతి, ఖర్చు చేసిన నిధులు, భౌతిక పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ పనులు నిలిచిపోయాయో స్పష్టంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

కలెక్టరేట్‌లో నిర్మాణంలో ఉన్న శ్రీ శక్తి భవనం పనులను మహిళా దినోత్సవం నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. పనుల విషయంలో జాప్యం సహించబోమని హెచ్చరించారు.

ప్రజల సౌకర్యాల కల్పనలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రతి పని నాణ్యతతో పూర్తి కావాలని, పర్యవేక్షణ కఠినంగా ఉండాలని సూచించారు. తదుపరి సమీక్ష సమయానికి స్పష్టమైన పురోగతి కనిపించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు.

Sthanikam

గడువులోపు పనులు పూర్తి చేయాలి… జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News