Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 02:09 PM

గడ్డి కోయడంలో శ్రమకు విముక్తి – రైతులకు వరంగా ఆధునిక యంత్రాలు

29-12-2025 134 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గడ్డి కోయడంలో ఆధునిక సౌలభ్యం

రైతులకు ఉపయోగకరంగా మారిన గడ్డి కోసే యంత్రాలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

వరాలు, గట్లపై గడ్డి కోయడం రైతులకు ఎప్పటినుంచో కష్టసాధ్యమైన పని. శ్రమ ఎక్కువ, కూలీల ఖర్చు భారంగా మారిన ఈ సమయంలో ఆధునిక గడ్డి కోసే యంత్రాలు రైతులకు నిజంగా వరంగా మారాయి.

ఇటీవల రామన్నపేట పరిసర ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ యంత్రాలతో తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతోనే ఎక్కువ విస్తీర్ణంలో గడ్డి కోయడం సాధ్యమవుతోంది. రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధరలో లభిస్తున్న ఈ యంత్రాలు రోజుకు ఐదు నుంచి పది ఎకరాల వరకు గట్లపై గడ్డి కోయగలవు.

మునుపు పది మంది కూలీలు పనిని ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు, కేవలం ఐదు లీటర్ల పెట్రోల్‌తో పూర్తి చేయగలుగుతున్నారు. దీని వల్ల సమయం ఆదా కావడంతో పాటు ఖర్చు గణనీయంగా తగ్గుతోంది. కూలీల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ యంత్రాల అవసరం మరింతగా పెరుగుతోంది.

వ్యవసాయ పనుల్లో యాంత్రీకరణ రైతుల భారం తగ్గిస్తూ, పనితీరును మెరుగుపరుస్తోంది. గడ్డి కోయడంలో ఈ యంత్రాల వినియోగం భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Sthanikam

గడ్డి కోయడంలో శ్రమకు విముక్తి – రైతులకు వరంగా ఆధునిక యంత్రాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News