Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:42 AM

ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా… కాంగ్రెస్ టికెట్‌తో బరిలోకి… చివరికి ఓటమి!

15-12-2025 717 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం, గుడిబండ:

పంచాయతీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న ఓ మాజీ ఎస్ఐకి నిరాశే మిగిలింది. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగిన వెంకటేశ్వర్లు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

గుడిబండ గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లోకి రావాలనే ఆశతో వెంకటేశ్వర్లు ఎస్ఐ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి స్వయంగా మద్దతు ప్రకటించి ప్రచారం చేసినప్పటికీ, ఫలితం మాత్రం ఆశించినట్లుగా రాలేదు.

ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టిన వెంకటేశ్వర్ల నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే, గ్రామస్థుల ఓటింగ్ తీరు ఆయనకు అనుకూలంగా లేకపోవడంతో చివరికి ఓటమి తప్పలేదు.

ఉద్యోగ భద్రతను వదులుకొని రాజకీయ ఆశయాలతో పోటీ చేసిన అభ్యర్థికి ఎదురైన ఈ ఫలితం కాంగ్రెస్ శ్రేణుల్లోనూ కలకలం రేపుతోంది. గెలుపు ఖాయమనే అంచనాలతో ముందుకెళ్లిన నాయకత్వానికి ఈ ఫలితం షాక్‌గా మారింది.

Sthanikam

ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా… కాంగ్రెస్ టికెట్‌తో బరిలోకి… చివరికి ఓటమి!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News