Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

‘ఎరైవ్, ఏ లైవ్’ నినాదంతో రోడ్డు భద్రత అవగాహన సదస్సు

14-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆర్బి నగర్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కార్యక్రమం

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భువనగిరి పట్టణం 35వ వార్డు ఆర్బి నగర్‌లోని వినాయకుని మండపం,అంజిరెడ్డి కార్ఖానా వద్ద‘ఎరైవ్,ఏ లైవ్’ (Arrive Alive) నినాదంతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్, ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్(జేసీ)భాస్కర్ రావు,యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్,భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్,డిఎస్పీ రవీందర్ యాదవ్,పట్టణ సీఐ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ,రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి ఒక్కరూ‘ఎరైవ్,ఏ లైవ్’ నినాదాన్ని ఆచరించి క్షేమంగా గమ్యం చేరాలని సూచించారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని,ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,యువత రోడ్డు భద్రత నియమాలపై పూర్తి అవగాహనతో ఉండాలని,ప్రాణాలు విలువైనవని గుర్తించాలని కోరారు.భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ...."రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజలందరూ భద్రత నియమాలు పాటించి, ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని మరియు ప్రాణాలను కాపాడు కోవాలని, మన భద్రత మన చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు,ఈ సందర్భంగా రోడ్డు భద్రత,,ట్రాఫిక్ నియమాలు పాటియాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్&DE కొండలరావు,పిసిసి డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్,రాష్ట్ర పిసిసి కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్,మాజీ చైర్మన్ బర్రె జాంగిర్,కౌన్సిలర్లు అనిల్,తోట కూర వెంకటేష్ యాదవ్ గుర్రాల శ్రీను సీనియర్ కాంగ్రెస్ నాయకులు నక్కల ఆదినారాయణ,సుర్వి వేణు గౌడ్,నజీర్ భాయ్ కూర శివ కుమార్ పాండు యాదవ్ కటికే శ్రీను,కుమార్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎనగండ్ల సుధాకర్ వినయ్ మైనార్టీ నాయకులు అత్తర్,రఫ్ద్దీన్ ఇతర నాయకులు మరియు మున్సిపల్ అధికారులు,వార్డ్ ప్రజలు మరియు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.

Sthanikam

‘ఎరైవ్, ఏ లైవ్’ నినాదంతో రోడ్డు భద్రత అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News