Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:43 AM

ఏపీలో 135 విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలు

11-03-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల వెంట తొలి దశలో 135 విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వీటిలో మొత్తం 600 శక్తి నింపు యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ప్రధానమంత్రి ఈ–డ్రైవ్ పథకం కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఏప్రిల్ నెలలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. ప్రణాళిక ప్రకారం జూలై–ఆగస్టు నాటికి ఈ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఒక్కో కేంద్రం ఏర్పాటు చేయడానికి సుమారు రూ.50 లక్షల వరకు వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల్లో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, భారీవాహనాలు వంటి అన్ని రకాల విద్యుత్ వాహనాలకు శక్తి నింపు సదుపాయం కల్పించనున్నారు.

రెండో దశలో విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో మరిన్ని విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Sthanikam

ఏపీలో 135 విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News